ప్రేమ పేరుతో ఉపాధ్యాయుడి మోసం: HRC ని ఆశ్రయించిన యువతి

ప్రేమ పేరుతో ఉపాధ్యాయుడి మోసం: HRC ని ఆశ్రయించిన యువతి

చదువుకునే రోజుల్లో ప్రేమించి ఉద్యోగం రాగానే మొఖం చాటేసి మోసానికి పాల్పడ్డాడు ఓ ఉపాధ్యాయుడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. వదిలేసిన ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ యువతి రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ను (HRC) ఆశ్రయించింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా,రామోజీపేట గ్రామానికి చెందిన మంజుల MA, ఎంఫిల్ పూర్తి చేసింది. 2016 లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రిపరేషన్ కోసం హైదరాబాద్ లోని ఓయూ కు వచ్చింది. అదే టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆదిలాబాద్ జిల్లా,విగాపూర్ గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి రాజు తో ఓయూలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మరింది. కొన్నిరోజుల తర్వాత తిప్పిరెడ్డి రాజుకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చేరాడు. అప్పటి నుంచి ఫోన్ రిసీవ్ చేసుకోకపోవడంతో.. నేరుగా అతని దగ్గరకి వెళ్లి నిలదీసింది. అతను పట్టించుకోకపోవడంతో ఓయూ,ఇచ్చోడా,వాగపూర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది.అయినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఫిర్యాదును పట్టించుకోకపోగా… ఇచ్చోడా పోలీసులు తనను చితకబాది  అసభ్య పదజాలంతో దూషించారని ఆందోళన వ్యక్తం చేసింది. తనను పెళ్లిచేసుకుంటానని శారీరకంగా వాడుకొని వదిలేసిన తిప్పారెడ్డి రాజుపై, ఇచ్చోడా పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళా HRCని వేడుకుంది. తనను పెళ్లి చేసుకోకపోతే అతన్ని ప్రభుత్వ ఉద్యోగం నుండి తొలగించాలని కమిషన్ ను కోరుకుంది.