ముషీరాబాద్, వెలుగు: బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ హైస్కూల్లో శనివారం టీచర్స్డేను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి, తమ తోటి స్టూడెంట్లకు పాఠాలు బోధించారు.
అనంతరం పాఠశాల ఆవరణలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
