వచ్చే వారం రాష్ట్రంలో ర్యాలీలు..మహాధర్నాలు.. ఆందోళనకు ఉపాధ్యాయ సంఘాల పిలుపు

వచ్చే వారం రాష్ట్రంలో ర్యాలీలు..మహాధర్నాలు.. ఆందోళనకు ఉపాధ్యాయ సంఘాల పిలుపు

రాష్ట్రంలో  విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. జులై  18, 19 తేదీల్లో బైక్ ర్యాలీలు, ఆగస్టు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలకు పిలుపునిచ్చాయి. సెప్టెంబర్ 1న ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద మహాధర్నా చేపడతామని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడ్డారు. భవనాలు సరిగా లేవు..మౌలిక సదుపాయాలు సరిగా ఉండవు కానీ..ఉత్తీర్ణత శాతంపై ఒత్తిడి తేవడం విచారకరమన్నారు. 

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ  జూలై 18,19 తేదీల్లో తెలంగాణలోని అన్ని మండలాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ఆగస్ట్ 12న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపడతామని చెప్పారు. అలాగే సెప్టెంబర్ 1న చలో హైదరాబాద్ కు పిలుపు ఇచ్చిన ఉపాధ్యాయ సంఘాలు....సెప్టెంబర్ 1న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తామని వెల్లడించాయి. 

డిమాండ్లు ఇవే..

  • ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ, బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి.
  • పాఠశాల భవనాలు నిర్మించాలి, మౌళిక సదుపాయాలు కల్పించాలి.
  • పీఆర్పీ వేయాలి, జులై 1నుండి ఐఆర్ మంజూరు చేయాలి.
  • సీపీఎస్ ను రద్దు చేయాలి...‌ఓపిఎస్  రద్దు చేయాలి.
  • ఎన్ఇపి - 2020 రద్దు చేయాలి.