మద్యం అమ్మకాలు తగ్గితే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు ఎందుకు బాధ? : జూపల్లి కృష్ణారావు

మద్యం అమ్మకాలు తగ్గితే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు ఎందుకు బాధ? :  జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ గగ్గోలు పెడుతోందని, ఆ పార్టీకి ఎందుకు అంతా బాధ అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. తాగడం తగ్గితే ప్రజలకు ఏం నష్టం జరుగుతుందన్నారు. మంగళవారం గాంధీ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేందుకే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు చెందిన పత్రిక తప్పుడు కథనాలు రాస్తోందని మండిపడ్డారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైనందునే ఇలాం టి పనులు చేస్తున్నారని విమర్శించారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ ఇప్పటి వరకు అప్లయ్‌‌‌‌ చేసుకోలేదని, ప్రస్తుతం ఉన్న బ్రాండ్లు 19 డిపోలలో నిల్వ ఉన్నాయ ని చెప్పారు. గత ప్రభుత్వం మద్యం కంపెనీలకు బకా యిలు చెల్లించలేదని, వాటికి తాము ఇప్పుడు చెల్లింపు లు చేస్తున్నామని తెలిపారు. కొంత బకాయిలు పెం డింగ్‌‌‌‌లో ఉన్నందున బీర్ల షార్టేజ్ వచ్చిందని చెప్పారు.