సిసోడియాకు బెయిల్ నిరాకణ

సిసోడియాకు బెయిల్ నిరాకణ

న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా(52) దాఖలు చేసిన పిటిషన్‌‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో సిసోడియా బెయిల్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది. వాదనల అనంతరం బెంచ్ స్పందిస్తూ..సిసోడియా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని,  ఆయన ఢిల్లీ ప్రభుత్వ అధికార కారిడార్‌‌లలో చాలా శక్తివంతమైన, ప్రభావవంతమైన వ్యక్తి అని వెల్లడించింది.

ఎలక్ట్రానిక్ ఆధారాలతో సహా కీలకమైన సాక్ష్యాలను నాశనం చేయడంలో సిసోడియా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయని గుర్తుచేసింది. ఎక్సైజ్ పాలసీని రూపొందించే ప్రక్రియను సిసోడియా కూడా ప్రభావితం చేసినట్లు ఆధారాలు తెలియజేస్తున్నాయని పేర్కొంది..ఆయనకు బెయిల్ మంజూరు చేయలేమని తేల్చి చెప్పింది.