ఝాన్సీలోని రెండు పోలింగ్ బూత్​లలో 100% ఓటింగ్

ఝాన్సీలోని రెండు పోలింగ్ బూత్​లలో 100% ఓటింగ్
  •    ఐదో ఫేజ్ ఎన్నికల్లో రికార్డు

ఝాన్సీ (యూపీ): యూపీ ఝాన్సీ లోక్ సభ సెగ్మెంట్ లో రెండు పోలింగ్ బూత్ లలో 100% ఓటింగ్ నమోదైంది. ఐదో ఫేజ్ ఎన్నికల్లో ఈ రికార్డు నమోదైందని అధికారులు తెలిపారు. మంగళవారం ఈ మేరకు డిస్ట్రిక్ ఎలక్షన్ ఆఫీసర్ (డీఈవో) అక్షయ్ త్రిపాఠీ చెప్పారు. మొహ్రాని అసెంబ్లీ సౌల్దాలోని పోలింగ్ బూత్ నంబర్ 277లో 100% ఓటింగ్ రికార్డయిందన్నారు. ఈ పోలింగ్ కేంద్రంలో 375 మంది ఓటర్లు ఉండగా అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు.

 బమ్హెరా నాగల్ గ్రామంలోని బూత్ నంబర్ 355లోనూ 100% ఓటింగ్ నమోదైందని వివరించారు. ఇక్కడ 441 మంది ఓటర్లు ఉండగా అందరూ ఓటు వేశారని వెల్లడించారు. బుధ్ని నరహత్ గ్రామంలోని ఓ బూత్ లోను  సాంకేతిక సమస్యలతో100% ఓటింగ్ పై గందరగోళం నెలకొందన్నారు. ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో ఝాన్సీ లోక్ సభలో 63.57% ఓటింగ్ నమోదైందని స్పష్టం చేశారు.