ఇండియా కూటమి గెలిస్తేనే సెక్యులర్ ప్రజాస్వామ్యం : మల్లు రవి

ఇండియా కూటమి గెలిస్తేనే సెక్యులర్ ప్రజాస్వామ్యం :  మల్లు రవి

న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో సెక్యులర్ ప్రజాస్వామ్యం రావాలంటే ఇండియా కూటమి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు.  ఢిల్లీలో ఉన్న తెలుగువారందరూ ఇండియా కూటమికి ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో  ఆరవ విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. నార్త్ ఈస్ట్ నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కన్నయ్య కుమార్ కు మద్దతుగా మల్లు రవి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..దేశంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర పేరుతో దేశాన్ని మళ్లీ ఐక్యం చేశారని తెలిపారు.  దేశంలో మోదీ నిరంకుశత్వాన్ని తరిమికొట్టేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే..బడుగు, బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని  మల్లు రవి పేర్కొన్నారు.