IND vs AUS : టాప్ ఆర్డర్ ఫెయిల్.. 16 పరుగులకే 3 వికెట్లు

IND vs AUS : టాప్ ఆర్డర్ ఫెయిల్.. 16 పరుగులకే 3 వికెట్లు

వాంఖడే స్టేడియంలో జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ లో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. దాంతో 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆసీస్ పేస్ బౌలర్లు స్టోయినిస్, మిచెల్ స్టార్క్ రెచ్చిపోయారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (3)ని స్టోయినిస్ 1.6 ఓవర్ లోనే ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీని (4) 4.5 ఓవర్ లో స్టార్క్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు.

నాలుగో వికెట్లో వచ్చిన సూర్య కుమార్ యాదవ్ ను కూడా స్టార్క్ తర్వాత బంతికే ఎల్బీడబ్ల్యూ చేశాడు. దీంతో సూర్య డక్ ఔట్ గా స్టాండ్స్ లోకి వెళ్లి పోయాడు. ప్రస్తుతం టీమిండియా 7 ఓవర్లలో 27/3 స్టేజ్ లో ఉంది. క్రీజులో శుభ్ మన్ గిల్ (14), కేఎల్ రాహుల్ (5) ఉన్నారు.