తొలిరోజు పైచేయి సాధించిన  టీంఇండియా

తొలిరోజు పైచేయి సాధించిన  టీంఇండియా
  • ఇంగ్లండ్ టెస్టులో ఆకట్టుకున్న భారత బౌలర్లు
  • స్నేహ్​ రాణాకు 3 వికెట్లు​    
  • ఇంగ్లండ్​ విమెన్స్​ 269/6
  • రాణించిన నైట్‌

బ్రిస్టల్:  ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టులో ఇండియా విమెన్స్‌ టీమ్‌ తొలి రోజు చివర్లో  పైచేయి సాధించింది. తొలుత ఆకట్టుకోలేకపోయిన బౌలర్లు ఆఖర్లో పుంజుకున్నారు. ఐదేళ్ల తర్వాత తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్‌ ఆడుతున్న స్పిన్నర్‌ స్నేహ్‌ రాణా (3/77), ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ (2/50) ఆకట్టుకొని హోమ్‌టీమ్‌ జోరుకు బ్రేకులు వేశారు. ఫలితంగా తొలి రోజు చివరకు ​ఇంగ్లండ్‌ ఫస్ట్​ ఇన్నింగ్స్​లో 92 ఓవర్లలో 6 వికెట్లకు 269 రన్స్​ చేసింది. కెప్టెన్‌ హెథర్‌ నైట్‌ (175 బాల్స్‌లో 9 ఫోర్లతో 95) కొద్దిలో సెంచరీ మిస్‌ చేసుకోగా.. ఓపెనర్‌  టామీ బ్యూమోంట్​​ (66) ఫిఫ్టీతో రాణించింది. ప్రస్తుతం  సోఫియా డంక్లీ (12 బ్యాటింగ్​), కేథరిన్​బ్రంట్​(7 బ్యాటింగ్​) క్రీజులో ఉన్నారు. 

ఓపెనర్ల జోరు
టాస్​ గెలిచి బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లండ్​కు ఓపెనర్లు లారెన్​ విన్​ఫీల్డ్​ హిల్​ (35), టామీ బ్యూమోంట్​మంచి ఆరంభాన్నిచ్చారు. ఫస్ట్​ వికెట్​కు 69 రన్స్​ జోడించిన హిల్‌ను వస్త్రాకర్‌ ఔట్‌ చేసింది. అయితే,  వన్​డౌన్​లో వచ్చిన కెప్టెన్ హెథర్​ నైట్​ అదిరిపోయే ఇన్నింగ్స్​ ఆడింది. పేసర్లు జులన్​, శిఖా బౌలింగ్​లో వేగంగా రన్స్​ చేసిన నైట్​.. స్పిన్నర్లను కూడా వదల్లేదు. దాంతో, హోమ్‌టీమ్‌ ఫస్ట్‌ సెషన్‌లో 86/1 స్కోరు సాధించింది. లంచ్​ తర్వాతా ఇంగ్లండ జోరు కొనసాగింది.  ఈ దశలో స్నేహ్‌ బౌలింగ్‌లో బ్యూమెంట్​ ఔటైనా.. నటాలీ సివర్​ (42) కాసేపు బ్యాట్​ అడ్డేసింది. నైట్​కు​ మంచి  సపోర్ట్‌  స్కోరు పెంచే ప్రయత్నం చేయగా.. ఇంగ్లండ్‌ 162/2 టీ బ్రేక్‌కు వెళ్లింది. ఈ క్రమంలో నైట్ ​115 బాల్స్​లో ఫిఫ్టీ మార్క్​ అందుకుంది. మూడో వికెట్​కు 90 రన్స్​ జోడించిన తర్వాత ఇంగ్లండ్​ ఇన్నింగ్స్​ కాస్త తడబడింది. దీప్తి శర్మ, స్నేహ్​ రాణా కట్టుదిట్టమైన బౌలింగ్​ చేస్తూ.. రెండో ఎండ్​లో చకచకా వికెట్లు తీశారు. దీంతో 21 రన్స్​ తేడాతో అమీ జోన్స్​ (1), నైట్​, ఎల్విస్​ (5) పెవిలియన్​కు చేరడంతో ఇండియా రేస్​లోకి వచ్చింది. అయితే సోఫియా, బ్రంట్ మరో వికెట్​ పడకుండా జాగ్రత్తగా ఆడారు.