సాంకేతిక కారణమా.. మానవ తప్పిదమా.. ఒడిశా రైలు ప్రమాదంపై వెల్లువత్తుతోన్న ప్రశ్నలు

సాంకేతిక కారణమా.. మానవ తప్పిదమా.. ఒడిశా రైలు ప్రమాదంపై వెల్లువత్తుతోన్న ప్రశ్నలు

ఒడిశాలో జూన్ 2న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషాద ఘటనకు గల కారణాలపై పలువురు ప్రశ్నలు రేకెత్తిస్తున్నారు. ఈ ప్రమాదానికి సిగ్నల్(సాంకేతిక) లోపం కారణమా లేదంటే.. మానవ తప్పిదమా అన్న దానిపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.

 రైల్వే మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా యాంటీ-కొలిజన్ సిస్టమ్ "కవాచ్"ని ఇన్‌స్టాల్ చేసింది. ఇది రైలు ఢీకొనడానికి కారణమయ్యే సిగ్నల్ (సిగ్నల్ పాస్డ్ ఎట్ డేంజర్ -- SPAD)సందర్భం వచ్చినపుడు హెచ్చరిస్తుంది. ఈ సిస్టమ్.. రైలు డ్రైవర్‌ను అప్రమత్తం చేయగలదు, బ్రేక్‌లను నియంత్రించగలదు, అదే ట్రాక్‌లపై మరొక రైలు వస్తున్నపుడు రైలును ఆపగలదు. అయితే ఈ ప్రమాదం జరిగిన మార్గంలో కవాచ్ అందుబాటులో లేదని అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ చెబుతున్నారు. కాగా ఈ ప్రమాదానికి కారణమేమిటన్న దానిపై రైల్వే మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది.