తీన్మార్‌ మల్లన్న బెయిల్‌ పిటిషన్‌ మరోసారి వాయిదా

తీన్మార్‌ మల్లన్న బెయిల్‌ పిటిషన్‌ మరోసారి వాయిదా

తీన్మార్‌ మల్లన్న బెయిల్‌ పిటిషన్‌ మరోసారి వాయిదా వేసింది మల్కాజిగిరి కోర్టు. ఏప్రిల్ 11వ తేదీ మంగళవారం తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. నాన్ బెయిలబుల్ సెక్షన్ అసలు మల్లన్నపై వర్తించదని మల్లన్న తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బెయిల్ అడ్డుకోవడానికి పాత వారెంట్స్ తెరమీదకు తెస్తున్నారని వాదించారాయన. సాంకేతిక కారణాలు చూపించి బెయిల్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు మల్లన్న న్యాయవాది. 

ఒకే కేసులో అరెస్ట్ చేసి.. మల్లన్న ను రిమాండ్ చేస్తే.. మూడు బెయిల్ పిటిషన్స్ ఎందుకు దాఖలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రభుత్వ తరపు న్యాయవాది. మరో రెండు కేసులు తీన్మార్ మల్లన్నపై నమోదు కావడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని వేశామని మల్లన్న న్యాయవాది కోర్టుకు తెలిపారు. రెండు వర్గాల వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్ 12వ తేదీకి వాయిదా వేసింది. తీన్మార్‌ మల్లన్నపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 90 కేసులు నమోదయ్యాయి. నోటీసు ఇవ్వకుండా తన భర్తను అరెస్ట్‌ చేశారని మల్లన్న భార్య మమత ఏప్రిల్‌ 3న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.