మూడు రోజులు దంచికొట్టనున్న ఎండలు.. ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ

 మూడు రోజులు దంచికొట్టనున్న ఎండలు..  ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు ఎండలను తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ అప్రమత్తమై పలు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ జిల్లాల్లో టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ ధర్మ రాజ్ చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ టెంపరేచర్స్ నమోదవుతున్నాయని చెప్పారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. ఇక, హైదరాబాద్ నగరంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. 

Also Read:భానుడి భగభగ.. జనం విలవిల.. 45 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు..

రానున్న మూడురోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత పెరగనుందని..  వడగాల్పులు కూడా ఎక్కువ ఉండనున్నాయని ఆయన చెప్పారు.   మూడు రోజులు రాష్ట్రానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేస్తున్నామన్నారు. మే చివరి వరకు రాష్ట్రంలో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని.. మే నెలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి చెప్పారు.