చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటాం : దీపా దాస్ మున్షీ

చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటాం :  దీపా దాస్ మున్షీ

గత పది సంవత్సరాలలో ఎమ్మెల్యే, ఎంపీలు సిరిసిల్లలో పద్మశాలి కమ్యూనిటీకి ఏం చేయలేదన్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ . పద్మశాలి లను రాజకీయంగా వాడుకున్నారని ఆరోపించారు.  సిరిసిల్లలో  ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి  దీపాదాస్‌ మున్షీ పరామర్శించారు.   

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  సిరిసిల్లలో గత నాలుగు నెలల్లో ఐదుగురు కార్మికులకు చనిపోవడం బాధకరమని చెప్పారు.  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత బట్టలపై 12 శాతం జీఎస్టీ వేసిందని మండిపడ్డారు.  బతుకమ్మ చీరల బిల్లులను గత బీఆర్ఎస్ సర్కార్ చెల్లించలేదన్నారు.   

ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత తమ  ప్రభుత్వం కార్మికులకు కొత్త పాలసీని తీసుకొస్తుందని తెలిపారు దీపాదాస్ మున్షీ.  చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా  హామీ ఇచ్చారు. ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామన్నారు.  చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.