యూట్యూబర్ అన్వేష్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పంజాగుట్ట పోలీసులు అన్వేష్ ఐడీ వివరాల కోరుతూ ఇంస్టాగ్రామ్ కు లేఖ రాశారు. అన్వేష్ అకౌంట్లో ఉన్న అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర వీడియోకు సంబంధించి లింక్ ఉన్న యూజర్ ఐడీ వివరాలు ఇవ్వాలని కోరుతూ ఇంస్టాగ్రామ్ కు లేఖ రాశారు పంజాగుట్ట పోలీసులు. ఇంస్టాగ్రామ్ నుండి రిప్లై కోసం వెయిట్ చేస్తున్న పోలీసులు.. రిప్లై రాగానే తదుపరి చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో అన్వేష్ పై పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదయ్యింది. సినీ నటి కరాటే కళ్యాణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ తో ప్రపంచ యాత్రికుడిగా పాపులారిటీ సంపాదించుకున్న అన్వేష్ విదేశాల్లో ఉంటూ ఇష్టానుసారంగా వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు.. అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు... గతంలో కూడా పలు అంశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు అన్వేష్.
ఇప్పుడు హిందూ దేవతలు, అమ్మాయిల వస్త్రధారణ వంటి సున్నిత అంశాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సీన్లోకి పోలీసులు ఎంటరయ్యారు. అన్వేష్ పై హిందూ సంఘాలు రగిలిపోతున్నాయి.. అన్వేష్ ను దేశద్రోహిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి హిందూ సంఘాలు. అన్వేష్ ను ఇండియాకు రప్పించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి హిందూ సంఘాలు. మరి, నెట్టింట రచ్చ రేపుతున్న అన్వేష్ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
