డ్రగ్స్ డాన్ మెన్ చో హత్య.. క్రిమినల్ సామ్రాజ్యాన్నే స్థాపించాడు.. మెక్సికో దేశంలో అల్లర్లు

డ్రగ్స్ డాన్ మెన్ చో హత్య.. క్రిమినల్ సామ్రాజ్యాన్నే స్థాపించాడు.. మెక్సికో దేశంలో అల్లర్లు

మెక్సికో లో మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ డాన్ ఎల్ మెన్ చో కాల్చివేతతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారంతో మెక్సికో సైన్యం చేపట్టిన కీలక ఆపరేషన్ లో డ్రగ్స్ డాన్ మెన్ చో హతమయ్యాడు. ఈ క్రమంలో మెక్సికో వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. మెన్ చో అరెస్టుతో వీరంగం సృష్టించింది డ్రగ్ మాఫియా. విమానాలపైనా, ఆర్మీ వాహనాలపై దాడి చేసి ధ్వంసం చేశారు దుండగులు. మాఫియా వీరంగంతో అట్టుడికిపోయాయి మెక్సికో నగరాలు. ఇంతటి విధ్వంసానికి కారణమైన మెన్ చో ఎవరు..? అతని అరెస్ట్ తర్వాత ఈ రేంజ్ లో హింస అందుకు చెలరేగిందో ఇప్పుడు తెలుసుకుందాం...

ఎల్ మెన్ చో ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ డాన్ లలో ఒకడు. అత్యంత శక్తివంతమైన క్రిమినల్ సామ్రాజ్యమైన జాలిస్కా న్యూ జనరేషన్ కార్టెల్ ను స్థాపించాడు మెన్ చో. అజ్ఞాతంలో ఉన్న మెన్ చో జాలిస్కోలో జరిగిన సైనిక కాల్పుల్లో గాయపడి.. మెక్సికో నగరానికి తరలిస్తుండగా విమానంలో మరణించినట్లు తెలిపింది ప్రభుత్వం.

మెన్ చో మరణంతో జాలిస్కో సహా అనేక రాష్ట్రాల్లో తీవ్ర హింసకు దారి తీసింది. ఎక్కడికక్కడ విమానాలు, ఆర్మీ వాహనాలు తగలబెట్టి వీరంగం సృష్టించింది మెన్ చో మాఫియా. ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అయిన ప్యూర్టో వల్లర్టాపై మాఫియా అల్లర్లు తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. 

ఎయిర్ పోర్టులో దట్టమైన పొగ కమ్మేయడంతో జనం పరుగులు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పరిస్థితి అదుపులోకి వచ్చేంతవరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని జాలిస్కో ప్రభుత్వం సూచించింది.