మీ బండారం బయటపడ్తదనే అసెంబ్లీ నుంచి పారిపోయిర్రు: బీఆర్ఎస్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్

మీ బండారం బయటపడ్తదనే అసెంబ్లీ నుంచి పారిపోయిర్రు: బీఆర్ఎస్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్

హైదరాబాద్: బీఆర్ఎస్ అసెంబ్లీ సెషన్‎ను బాయ్ కాట్ చేయడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. శుక్రవారం (జనవరి 2) అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పలాయన వాదం పాటిస్తోందని.. అసెంబ్లీ సెషన్‌ను బాయ్‌కాట్‌ చేయడం పలాయన వాదమేనని అన్నారు. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ జరిగితే మీ బండారం బయటపడుతుందనే సెషన్‌ బాయ్‌కాట్‌ డ్రామా పేరుతో పారిపోయారని విమర్శించారు. 

బీఆర్‌ఎస్‌ హయాంలోనే కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎసీంలు చాలని సంతకం చేసి కేసీఆర్ తెలంగాణకు మరణ శాసనం రాశారని విమర్శించారు. కృష్ణా జలాలపై పోరాటం చేస్తామన్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఎక్కడున్నారని ప్రశ్నించారు. కృష్ణా జలాలపై పార్టీ కార్యాలయంలో మాట్లాడటం కాదని.. అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని కేసీఆర్‎కు సవాల్ విసిరారు.

Also Read : తెలంగాణ, ఏపీ జలవివాదాలపై కొత్త కమిటీ

అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ జరిగితే బీఆర్ఎస్ చేసిన అన్యాయం బయటపడుతోందని ఆ పార్టీ బాయ్ కాట్ పేరుతో డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సభ ఎలా నడిచింది గుర్తు చేసుకోవాలని.. కాంగ్రెస్ సభ్యులను మొత్తం సెషనేకే సస్పెండ్ చేశారని అన్నారు. కాగా, స్పీకర్, ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే.