తిమ్మాపూర్లో మండలంలో పోలీసులపై యువకుడి దాడి..?

తిమ్మాపూర్లో మండలంలో  పోలీసులపై యువకుడి దాడి..?

తిమ్మాపూర్, వెలుగు: తిమ్మాపూర్​మండలం గొల్లపల్లె గ్రామానికి చెందిన ఓ యువకుడు బుధవారం రాత్రి పోలీసులపై దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి..

 గ్రామానికి చెందిన ఓ యువకుడు రాత్రి తన తండ్రిని కొడుతున్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్​ చేశాడు. అక్కడకు చేరుకున్న ఎస్ఐ, ఏఎస్​ఐ ఆ యువకుడిని ఆపేందుకు వెళ్లగా అతడు వారిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఏఎస్ఐకు స్వల్పగాయాలు కాగా, దాడిని అడ్డుకున్న మరో యువకుడి చేయి విరిగినట్లు సమాచారం. గురువారం యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.