కరీంనగర్/గోదావరిఖని, వెలుగు: కరీంనగర్ జిల్లాకు చెందిన లీడర్లు సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లో గురువారం కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సీఎంను కలిసి శుభాకాంక్షలు చెప్పడంతోపాటు కరీంనగర్ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు సీఎంను కలిసి, ఇటీవల పంచాయతీ ఎన్నికల ఫలితాలను వివరించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ సీఎంను, మంత్రి శ్రీధర్‌బాబును కలిసి విషెస్ చెప్పారు. వీరితోపాటు సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డి సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
