- నితీశ్ సర్కారుకు తేజస్వీ కంగ్రాట్స్
పాట్నా: బిహార్ ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నెరవేరుస్తుందనే అనుకుంటున్నానని ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన తొలిసారి స్పందించారు. 10వ సారి సీఎంగా ప్రమాణం చేసిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌కు, కొత్త మంత్రులకు అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. ‘కొత్త ప్రభుత్వం బిహార్ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చేలా పనిచేస్తుందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. కాగా, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్‌జేడీ కేవలం 25 సీట్లకే పరిమితమైంది.
