తెలంగాణ ఉద్యమకారులు వాటర్  ట్యాంక్  ఎక్కి నిరసన.. తమకు న్యాయం చేయాలని డిమాండ్

తెలంగాణ ఉద్యమకారులు వాటర్  ట్యాంక్  ఎక్కి నిరసన.. తమకు న్యాయం చేయాలని డిమాండ్

గోదావరిఖని/జ్యోతినగర్, వెలుగు: తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ సోమవారం పలువురు తెలంగాణ ఉద్యమకారులు వినూత్న నిరసనకు దిగారు. రామగుండం ఎన్టీపీసీ శాలపల్లి రోడ్డులో ఉన్న మున్సిపల్  వాటర్  ట్యాంక్  ఎక్కి నినాదాలు చేశారు.

తెలంగాణ ఉద్యమకారుల వేదిక డిప్యూటీ చైర్మన్​ తోడేటి శంకర్ గౌడ్, పొన్నం విజయ్ గౌడ్, వొల్లాల మల్లేశ్​ ట్యాంక్ పైకి చేరుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 250 గజాల నివాస స్థలం, పిల్లలకు ఉద్యోగాల్లో 20 శాతం కోటా, నెలకు రూ.25 వేల పెన్షన్, బస్సు, ట్రైన్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. ఎన్టీపీసీ పోలీసులు అక్కడికి చేరుకుని ట్యాంక్​పై ఉన్న వారిని కిందకు దింపారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని గోదావరిఖని వన్ టౌన్  పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.