- తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి
ఓయూ, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, గుర్తింపు కార్డు, బస్సు పాస్ ఇస్తానన్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ.. ఈ నెల 16న సీఎంకు కృతజ్ఞత సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి తెలిపారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి ఉద్యమకారులు, విద్యార్థులతో కలిసి క్షీరాభిషేకం చేశారు.
గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు తగిన గుర్తింపు గౌరవం దక్కలేదని ఆరోపించారు. ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో కృతజ్ఞత సభ జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.రహీం, కన్వీనర్ చందర్ నాయక్, నాయకులు బోరెల్లి సురేశ్, గడ్డ యాదయ్య, కందుల శ్రీను, అందె కృష్ణ, అంజి తదితరులు పాల్గొన్నారు.
