Viral Video: కొత్త కొత్తగా పెళ్లయ్యింది.. సీఎం ఎవరో నాకు తెలీదు

Viral Video: కొత్త కొత్తగా పెళ్లయ్యింది.. సీఎం ఎవరో నాకు తెలీదు

తెలంగాణలో పొలిటికల్ హీట్ నడుస్తోంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనుండడంతో అన్ని మీడియా ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెల్స్ పల్లెబాట పట్టాయి. ఓనర్ నాడి పట్టేందుకు పబ్లిక్ టాక్ పేరిట సర్వేలు చేస్తున్నాయి. అయితే ఓటర్లు చెప్పే మాటలు ఒక్కోసారి నవ్వులు పూయిస్తున్నాయి. తాజాగా, ఇలాంటి సమాధానమే ఓ మహిళా ఓటర్ నుంచి రావటంతో అది బాగా వైరల్ అవుతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని ఓ గ్రామంలో వీ6 న్యూస్ పబ్లిక్ ఓపీనియన్ చేపట్టింది. అందులో భాగంగా మిడియా ప్రతినిధి ప్రశ్నలు.. ఓటరు సమాధానాలు ఇలా ఉన్నాయి..

సీఎం కేసీఆర్ అందరికీ తెలుసు అనుకుంటున్నారు.. కేసీఆర్ ఎవరో కూడా తెలియని వారు ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.. ఎవరికి దోచిన విధంగా విధంగా.. భిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్లు. ఎలక్షన్ టైం కావటంతో.. మరింత వైరల్ అయ్యింది ఈ వీడియో...