హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ లాబీల్లో మంత్రుల చాంబర్లను అధికారులు మార్చారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చాంబర్లను ఫస్ట్ ఫ్లోర్‌కు మార్చా రు. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న మంత్రి సీతక్క చాంబర్‌ను అదే ఫ్లోర్‌లో వెనుకకు మార్చారు. కాగా, గ్రౌండ్ ఫ్లోర్‌లో డిప్యూటీ స్పీకర్‌కు చాంబర్ కేటాయించేందుకు ఈ మార్పులు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
