హైదరాబాద్సిటీ, వెలుగు: ఎన్నికల టైంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని, లేదంటే ఆటోలను నిరవధికంగా బంద్ పెడ్తామని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ హెచ్చరించింది. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసును ముట్టడించి ధర్నా చేశారు. జేఏసీ కన్వీనర్ బి. వెంకటేశం(ఏఐటీయూసీ), జేఏసీ నేతలు ఎల్.రూప్ సింగ్, ఎం.ఎ.సలీం(తెలంగాణక్ జాగృతి), ఈ.ప్రవీణ్(టీయూసీఐ), వేముల మారయ్య(బీఆర్టీయూ), ఎ.సత్తిరెడ్డి (టీఏడీఎస్), యాదగిరి(టీఎన్టీయూసీ), జి.శ్రీనివాస్(జీహెచ్ఏటీఎస్)తో పాటు వందలాది మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
బి.వెంకటేశం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఏడాదికి ఆటో డ్రైవర్ కు రూ.12 వేల ఆర్థిక సాయం, రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు వంటి హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. వాటిని అమలు చేయడం లేదన్నారు.

