
నటుడు ప్రకాశ్ రాజ్ కు తెలంగాణ బీజేపీ తన సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చింది. ఒక్కడు సినిమాలో బురదలో ఉన్న ప్రకాశ్ రాజ్ ఫోటో, మరో వైపు బురదలో ఉన్న పంది ఫోటోను పోస్ట్ చేసి ఈ రెండు ఒక్కటేనా అని ప్రశ్నించింది.
అసలేం జరిగిందంటే.? ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయిన తర్వాత కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మోదీ ఎక్కడికెళ్లినా తన నరనరాన దేశభక్తి ప్రవహిస్తోందని చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాశ్ రాజ్ తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. మోదీ రక్తంలో ప్రవహించేది దేశభక్తి కాదని..ఎన్నికలే అని పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో హాస్పిటల్ సిందూర్, సిందూర్ డొనేషన్ క్యాంప్ అని పెట్టి..మోదీ రక్తంతో సిందూరం తయారు చేసి ఆడబిడ్డల నుదుటిన బొట్టు పెడుతున్న ఫోటోను ప్రకాశ్ రాజ్ షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీనికి తెలంగాణ బీజేపీ లేటెస్ట్ గా కౌంటర్ ఇస్తూ బురదలో ఉన్న పంది ఫోటోతో పాటు.. ఒక్కడు సినిమాలో ప్రకాశ్ రాజ్ బురదలో ఉన్న ఫోటో జత చేసి ఈ రెండూ ఒక్కటేనా? అని పోస్ట్ చేసింది.ఇపుడు ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ప్రకాశ్ రాజ్ పోస్ట్ పై నెటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
Both are same ?#justsaying https://t.co/S0PPeb022n pic.twitter.com/voaBRdvUN5
— BJP Telangana (@BJP4Telangana) May 23, 2025