కరెంట్ ఛార్జీలపై రిఫరెండంకు రెడీ

కరెంట్ ఛార్జీలపై రిఫరెండంకు రెడీ

పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.కరెంట్ ఛార్జీలపై రిఫరెండంకు తాను రెడీ అంటూ సవాల్ విసిరారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా సామాన్యులపై ఆరు వేల కోట్ల భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజలే ఆ పార్టీకి కరెంట్ షాక్ ఇస్తారన్నారు.రూ.48 వేల కోట్ల రూపాయలు డిస్కంలకు రాష్ట్రప్రభుత్వం చెల్లించకపోవడంతో డిస్కంలు దివాళ తీసి అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయన్నారు.టీఆర్‌ఎస్‌ అసమర్థత విధానాల వల్ల విద్యుత్‌ సరఫరాలో సాంకేతిక నష్టాలు ప్రతిసంవత్సరం పెరిగిపోతున్నాయన్నారు.పాతబస్తీలో ఎంఐఎంకు బయపడి విద్యుత్ బిల్లులు వసూలు చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. విద్యుత్‌ ఉద్యోగులపై ఎంఐఎం నాయకులు దాడులు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్‌ఛార్జీలు తగ్గించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

మరిన్ని వార్తల కోసం

గాలికి బ్రిడ్జ్ ఎలా కూలుతుందో నాకు అర్థం కావట్లేదు

ఢిల్లీ న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఆక్రమణల తొలిగింపు