హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం ఫిక్స్ అయ్యింది. 2026, మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి ఆదివారం (మార్చి 8) నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మార్చి 16 ఉదయం 11 గంటల 45 నిమిషాలకు అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కానున్నట్లు నోటిషికేషన్లో పేర్కొన్నారు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.
ఆ మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఇక, 2026-–27 వార్షిక బడ్జెట్ను మార్చి 20న ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం. కాగా, 2026, ఫిబ్రవరి 23న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మార్చి 16 నుంచి 30 వరకు బడ్జెట్ సమావేశాలు జరపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
