- మాజీ మంత్రి హరీశ్‌రావు
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తే, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం విధ్వంసం చేస్తున్నారని ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. రెండున్నరేళ్లలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని, కానీ లక్ష ఇండ్లను కూల్చేశారని ఆరోపించారు.
సీఎం రేవంత్‌రెడ్డి యూపీ తరహా బుల్డోజర్ రాజ్యాన్ని తీసుకొచ్చారని, యోగి ఆదిత్యనాథ్‌లా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆదివారం ముషీరాబాద్ బోలాక్‌పూర్‌లోని అంజుమన్ గర్ల్స్ హైస్కూల్‌లో నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ సలీంతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్, నగేశ్ముదిరాజ్, ముఠా జైసింహ, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
