19న తెలంగాణ కేబినెట్ సమావేశం

19న తెలంగాణ కేబినెట్ సమావేశం

తెలంగాణ కేబినెట్ భేటీ ఈనెల 19న జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో 19 మధ్యాహ్నం ఈ సమావేశం జరగనుంది. ఇందులో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనుంది. రాష్ట్రంలో కట్టుదిట్టంగా అమలు అవుతున్న లాక్ డౌన్ ను మే 3 వరకూ యథాతథంగా కొనసాగించాలా, వద్దా అనే అంశాలతో చర్చించనుంది. దీంతో పాటు కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇచ్చే విషయంపై సమగ్రంగా చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.