త్వరలోనే ఫీజు బకాయిలు చెల్లిస్తం .. ప్రైవేటు కాలేజీలకు సర్కారు హామీ

త్వరలోనే ఫీజు బకాయిలు చెల్లిస్తం .. ప్రైవేటు కాలేజీలకు సర్కారు హామీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను రిలీజ్ చేస్తమని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్​టీజీసీహెచ్ఈ ఆఫీసులో ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్మెంట్ల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఫీజు బకాయిల కోసం కొన్ని రోజుల నుంచి మేనేజ్మెంట్లు ఆందోళన చేస్తున్నారు.

 అయితే, ఈ ఫీజుల బకాయిల సమస్యను సీఎం దృష్టికి తీసుకుపోయినట్టు బాలకిష్టారెడ్డి మేనేజ్మెంట్లకు వివరించారు. బకాయిలు విడుదల చేయించే బాధ్యత తనదేనని వారికి ఆయన హామీ ఇచ్చారు. దీంతో కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రైవేటు కాలేజీలు హర్షం వ్యక్తం చేశాయి. పలు వర్సిటీల్లో జరిగే సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు సహకరిస్తామని స్పష్టం చేశాయి.