గర్వంగా ఉంది.. జైహింద్.. ఆపరేషన్ సిందూర్ పై సీఎం రేవంత్

గర్వంగా ఉంది.. జైహింద్..  ఆపరేషన్ సిందూర్ పై సీఎం రేవంత్

ఆపరేషన్ సిందూర్ పై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత దాడులు ఒక పౌరుడిగా గర్వపడుతున్నానని చెప్పారు. జైహింద్ అని ట్వీట్ చేసిన రేవంత్.. జాతీయ ఐక్యత కోసం అందరం కలిసి పనిచేస్దామని అన్నారు.

 భారత్, పాక్ ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో  సీఎస్, డీజీపీ, స్థానిక మిలిటరీ అధికారులతో రేవంత్  కాసేపట్లో  సమీక్ష జరపనున్నారు. మే 7న ఉదయం 11గంటలకు కమాండ్ కంట్రల్ సెంటర్ లో  సమీక్ష జరపనున్నారు రేవంత్.  తాజా పరిస్థితులపై   అప్రమత్తంగా ఉండాలని అన్ని విభాగాలకు రేవంత్ ఆదేశించారు.  అలాగే ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టికి రేవంత్ ఫోన్ చేశారు.వెంటనే ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరి రావాలని చెప్పారు.

ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో టెర్రరిస్టుల స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మెరుపు దాడుల్లో 100 మందికి పైగా పాక్ ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1.44 గంటలకు పీవోకేతోపాటు పాక్‌లోని 9 టెర్రరిస్ట్‌ స్థావరాలపై ఇండియన్‌ ఎయిర్‌‌ఫోర్స్‌ మిసైళ్లతో అటాక్‌ చేసింది. టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది.

 

ఇది యుద్ధ చర్యే: పాక్ ప్రధాని షెహబాజ్‌

పాకిస్తాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ ఈ దాడులను యుద్ధ చర్యగా పేర్కొంటూ ఖండించారు. పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అంతర్జాతీయ, దేశీయ విమానాలను నిలిపివేశారు. ఖచ్చితంగా ఇండియా దాడులకు పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని పాక్ ప్రధాని  షెహబాజ్ షరీఫ్ అన్నారు.