తెలంగాణ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్

తెలంగాణ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్
  • ఎంసెట్ పేరు మారుస్తూ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు

2024-25 విద్యాసంవత్సరానికి ఎంసెట్ తో సహా ఆరు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తేదీలను గురువారం (జవనరి 25) ప్రకటించింది తెలంగాణ ఉన్నత విద్యామండలి. ఇందులో ఎంసెట్ పేరు ను మార్చింది ఉన్నత విద్యామండలి. టీఎస్ ఈఏపీసెట్ గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  

తెలంగాణ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదే.. 

ఎంసెట్( టీఎస్ ఈఏపీ సెట్) ఇంజనీరింగ్ కోర్సులకు ప్రవేశ పరీక్ష : మే 9 నుంచి 11 వరకు 
ఎంసెట్( టీఎస్ ఈఏపీ సెట్)  అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ప్రవేశ పరీక్ష తేది : మే 12, 13 
జెఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంసెట్( టీఎస్ ఈఏపీ సెట్)  నిర్వహిస్తారు. 

టీఎస్ ఈసెట్ ప్రవేశ పరీక్ష: మే 6( ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహణ)
టీఎస్ ఎడ్ సెట్ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష: మే 23( మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహణ)
టీఎస్ లాసెట్ ప్రవేశ పరీక్ష: మూడేళ్లు, ఐదేళ్ల  కోర్సులకు: జూన్ 3
అదే రోజు ఎల్ ఎల్ ఎం ఎంట్రన్స్ టెస్ట్(పీజీఎల్ సెట్) కూడా ఉంటుంది. (ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహణ) 

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్ ఐసెట్: జూన్ 4,5 తేదీలు( కాకతీయ యూనివర్సిటీ నిర్వహణ) 
ఎంటెక్, ఎంఫార్మసీల్లో ప్రవేశానికి టీఎస్ పీజీ ఈసెట్ : జూన్6నుంచి 8 తేది వరకు (జేఎన్టీయూ నిర్వహణ) 
టీఎస్ పీఈసెట్( బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశానికి) పరీక్ష: జూన్ 10 నుంచి 13 తేదీ వరకు (శాతవాహన యూనివర్సిటీ నిర్వహణ)