CBIలో మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులు.. జీతం నెలకు 85 వేలకు పైమాటే !

CBIలో మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులు.. జీతం నెలకు 85 వేలకు పైమాటే !

కేంద్ర ప్రభుత్వరంగ బ్యాంక్​ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ) ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 03.

  • ఖాళీలు: 350.
  • విభాగాల వారీగా ఖాళీలు: ఫారెన్ ఎక్స్ఛేంజ్ ఆఫీసర్– III 50, మార్కెటింగ్ ఆఫీసర్– I 300.
  • ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. సంబంధిత విభాగంలో సీఎఫ్ఏ/ సీఏ/ ఎంబీఏ సర్టిఫికెట్ కలిగి ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. ఐఐబీఎఫ్ నుంచి ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఆపరేషన్స్​లో సర్టిఫికెట్ తప్పనిసరి కలిగి ఉండాలి.  పని అనుభవం తప్పనిసరి.
  • గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు.  కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • అప్లికేషన్ ప్రారంభం: జనవరి 20.
  • అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ.850.
  • లాస్ట్ డేట్: ఫిబ్రవరి 03.
  • పూర్తి వివరాలకు centralbankofindia.bank.in వెబ్​సైట్​ను సందర్శించండి.
  • సెలెక్షన్ ప్రాసెస్
  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్​లైన్ ఎగ్జామ్ 100 మార్కులకు, పర్సనల్ ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ఆన్​లైన్ ఎగ్జామ్​లో సంబంధిత స్ట్రీమ్ నుంచి 70 ప్రశ్నలు 70 మార్కులకు, బ్యాంకింగ్, ఎకనామిక్స్, జనరల్ అవేర్​నెస్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు ఎగ్జామ్ అడుగుతారు. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు.
  • కనీస అర్హత మార్కులు: జనరల్, ఈడబ్ల్యూఎస్ 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఓబీసీలు 45 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
  • వెయిటేజీ: రాత పరీక్షకు 70 శాతం, ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఉంటుంది.