
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేడు మన ఊరు-మన పోరు బహిరంగ సభ జరగనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరును నిరసిస్తూ... నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ సభకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సభను విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు.
రేపు కొల్లాపూర్ లో మన ఊరు మన పోరు భారీ బహిరంగ సభ.
— Telangana Congress (@INCTelangana) March 12, 2022
తెరాస నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిసి పోరాడుదాం. pic.twitter.com/RvMknFqsJF
మరిన్నివార్తల కోసం..