సాయంత్రం రాహుల్తో కాంగ్రెస్ సీనియర్ల భేటీ

 సాయంత్రం రాహుల్తో కాంగ్రెస్ సీనియర్ల భేటీ
  • రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం

న్యూఢిల్లీ: ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీని కలవనున్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ లోని రాహుల్ నివాసంలో మీటింగ్ జరగనుంది. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, పలు విభాగాల చైర్మన్లు మధు యాష్కీ, మహేశ్వర్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, సీనియర్ నాయకులు జానారెడ్డి, పొన్నాల లక్షయ్య, సీతక్క, బలరాం నాయక్, తదితరులు రాహుల్ తో సమావేశం కానున్నారు.

రాష్ట్రంలో ఇటీవల జరిగిన 40 లక్షల డిజిటల్ మెంబెర్ షిప్ తో పాటు.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత కుమ్ములాటలపై చర్చించే అవకాశాలున్నాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అపాయింట్ మెంట్ ఉన్నా.. వాళ్లు ఇవాళ్టి మీటింగ్ కు హాజరయ్యే అవకాశం లేదు. మొన్న మూడ్రోజుల పాటు.. ఢిల్లీలో ఉండొచ్చినా.. భట్టిని ఎవ్వరూ పట్టించుకోలేదని అలిగినట్లు తెలుస్తోంది. వీహెచ్ కు అపాయింట్మెంట్ లేకపోవడంతో.. జగ్గారెడ్డి కూడా వెళ్లనట్లు తెలుస్తోంది.

పార్లమెంట్ ఆవరణలో.. నిన్ననే ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్ రాహుల్ ను కలిశారు. హైకమాండ్ అపాయింట్ మెంట్లపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని రాహుల్ కు కంప్లైంట్ చేశారు. ఆ తర్వాతి రోజే అపాయింట్మెంట్ ఫిక్స్ కావడంతో.. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా ఢిల్లీ బాట పట్టారు.

 

 

 

ఇవి కూడా చదవండి

ఎంబీబీఎస్ స్టూడెంట్కు వివేక్ వెంకటస్వామి నివాళి

ఈ ఆటో డ్రైవర్.. ఒకప్పుడు ఇంగ్లీష్​ టీచర్

ఫ్యాట్​ ఈజ్​ క్యూట్​ అంటూ ర్యాంప్​ వ్యాక్

జైల్లో చదివిండు ఐఐటీ ర్యాంకర్​​ అయ్యిండు