CPGET నోటిఫికేషన్ విడుదల

CPGET నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో CPGET నోటిఫికేషన్ విడుదల నోటిఫికేషన్ విడుదలైంది. ఉస్మానియా, కాకతీయ తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు జేఎన్ టీయూ హెచ్, మహిళా యూనివర్సిటీల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (CPGET)ను నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. జూన్ 06వ తేదీ సోమవారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, వైస్ ఛైర్మన్ వెంకట రమణ, CPGET కన్వీనర్ పాండు రంగారెడ్డిలు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రోజు నుండి జూలై 4 వరకు CPGET అన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని లింబాద్రి తెలిపారు.

జూలై 20 నుంచి ఎంట్రెన్స్ టెస్ట్‌‌ల నిర్వహణ, 50 కోర్సులకు ఎంట్రెన్స్ టెస్ట్ జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం ఉస్మానియ యూనివర్సిటీ CPGET నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని 8 వర్సిటీల్లోని 320 పీజీ కాలేజీలకు సంబంధించిన పీజీ అడ్మిషన్స్ విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం కోఠి మహిళ విశ్వా విద్యాలయంలో కొత్తగా పీజీ అడ్మిషన్లు ప్రారంభించడం జరుగుతుందని, సోషల్ సైన్స్.. లాంగ్వేజ్ కోర్సుల్లో రాష్ట్రంలో ఏ డిగ్రీ చదివినా విద్యార్థులు పీజీ చేయవచ్చన్నారు.

మరిన్ని వార్తల కోసం : -
సీఎం కేసీఆర్‌‌కు బండి సంజయ్ లేఖ


అప్పుల బాధతో టీఆర్ఎస్ లీడర్ బలవన్మరణం