డిగ్రీ అడ్మిషన్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 6 నుంచి 22 వరకు దోస్త్ స్పెషల్ డ్రైవ్‌

డిగ్రీ అడ్మిషన్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 6 నుంచి 22 వరకు దోస్త్ స్పెషల్ డ్రైవ్‌

హైదరాబాద్, వెలుగు: డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులకు తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మరో అవకాశం కల్పించింది. ఇంకా సీటు దక్కని వారి కోసం, కాలేజీల్లో కోర్సులు మార్చుకోవాలనుకునే వారి కోసం స్పెషల్ డ్రైవ్, ఇంట్రా కాలేజీ ఫేజ్–-2  షెడ్యూల్‌‌ను టీజీసీహెచ్ఈ విడుదల చేసింది. ఈ నెల 6 నుంచి 22 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుందని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. ఇప్పటివరకు దోస్త్​లో రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు రూ.400 ఫీజు చెల్లించి ఈ నెల 6 నుంచి 11 వరకు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. వారితో పాటు దోస్త్ ఐడీ ఉన్న స్టూడెంట్లు 12 వరకూ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. సీట్ల కేటాయింపు ఆగస్టు 14న ఉండనున్నది. ఆన్‌‌లైన్ సెల్ఫ్ రిపోర్టుతో పాటు కాలేజీల్లో ఈ నెల18 వరకూ రిపోర్టు చేయాల్సి ఉంటుంది.