నేటి నుంచే టీఎస్ ఎంసెట్

నేటి నుంచే టీఎస్ ఎంసెట్

హైదరాబాద్, వెలుగు: ఎంసెట్ (ఇంజనీరింగ్ స్ర్టీమ్) ఎంట్రెన్స్ ఎగ్జామ్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు 8 సెషన్లలో ఈ ఎగ్జామ్ జరగనుంది. రెండు తెలుగు రాష్ర్టాల్లో మొత్తం 1,43,165 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయనున్నారు. వీరి కోసం తెలంగాణలో 79, ఏపీలో 23 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ నెల 9,10,11,14 తేదీల్లో ఈ పరీక్ష జరగనుంది. కరోనా రూల్స్ మేరకు ఎగ్జామ్‌ సెంటర్లలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. స్టూడెంట్లు శానిటైజర్లు, మాస్కులు వెంట తెచ్చుకోవచ్చన్నారు. ఎంసెట్ అగ్రికల్చర్ స్ర్టీమ్ కు ఈ నెల 28,29 తేదీల్లో ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పారు. కరోనా లక్షణాలు లేవని స్టూడెంట్స్​ముందే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.