ఏడుపాయల జారతకు రూ.1.50 కోట్లు

ఏడుపాయల జారతకు రూ.1.50 కోట్లు

మెదక్‌‌‌‌, వెలుగు: ఏడుపాయల జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.1.50 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వు లు వెలువడ్డాయి. మహాశివరాత్రి సందర్భంగా మెదక్‌‌‌‌ జిల్లా పాపన్నపేట మండల పరిధి నాగ్సానిపల్లి వద్ద ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల్లో వారంపాటు పెద్దఎత్తున జాతర జరుగుతుంది. తెలుగు రాష్ట్రా లతోపాటు, పొరుగున ఉన్న కర్నాటక, మహారాష్ట్రల నుంచి లక్షలాదిగా జనం తరలివస్తారు. ఏడుపాయల జాతరను ప్రభుత్వం స్టేట్‌‌‌‌ టూరిజం ఫెస్టివల్‌‌‌‌గా నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్‌‌‌‌ ఏటా జాతర నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నారు.

ఈ క్రమంలో మెదక్‌‌‌‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌‌‌‌రెడ్డి విజ్ఞప్తి మేరకు వచ్చే నెల 4వ తేదీ నుంచి జరుగనున్న ఏడుపాయల జాతర నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.