
వరలక్ష్మీ శరత్‌కుమార్(Varalakshmi Sarathkumar).. ఈపేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. నటిగా చాలా తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు ఆమె. భాషతో సంబంధం లేకుండా ఆఫర్స్ అందుకోవడం ఆమె స్పెషాలిటీ. నిజానికి చాలా కాలంగా ఆమె ఇండస్ట్రీలో ఉన్నప్పటికే సపోర్టింగ్ రోల్స్ చేయడంతో చాలా పాపులర్ అయ్యారు వరలక్ష్మీ శరత్‌కుమార్. తెలుగులో కూడా వరుస విజయాలు అందుకున్నారు. క్రాక్, నాంది, వీరసింహా రెడ్డి, కోటబొమ్మాళి పీఎస్, హనుమాన్ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఇక తాజాగా ఆమె నటిస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ శబరి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న వరలక్ష్మీ శరత్‌కుమార్.. ఈమధ్య కాలంలో తనపై వస్తున్న ట్రోలింగ్ పై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఆమె తన ప్రియుడు నికోలస్ తో నిశ్చితార్ధం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోనే ఈ ఇద్దరి పెళ్లితో ఒకటి కానున్నారు. అయితే ఇదే విషయంలో వరలక్ష్మీ పై ట్రోలింగ్ జరుగుతోంది. కారణం నికోలస్ కి ఇప్పటికే పెళ్ళై పిల్లలు కూడా ఉండటమే. దాంతో.. కేవలం డబ్బు కోసమే నికోలస్ ఆమెను పెళ్లి చేసుకుంటున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజాగా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు వరలక్ష్మీ శరత్‌కుమార్.. ప్రస్తుతం నేను కష్టపడి పనిచేస్తున్నాను. మంచి సంపాదన కూడా ఉంది. నికోలస్ కేవలం నా డబ్బును చూసి పెళ్లిచేసుకుంటున్నాడు అనడంలో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే.. తనదగ్గర కూడా చాలా డబ్బు ఉంది. తనతో నాకు కొన్నినెలల క్రితమే పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో నికోలస్ భార్య కూడా ఉన్నారు. నికోలస్ మర్యాద, ప్రవర్తన, ప్రొఫెషన్‌పై తనకున్న గౌరవం చూసి తనపై నాకు ప్రేమ ఏర్పడింది. ఇక రెండో పెళ్లి అంటారా.. మా నాన్న కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు.. అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.