గూగుల్ భారీ ప్రక్షాళన.. పైథాన్ ఒక్కటే కాదు.. డార్ట్, ఫ్లట్టర్ కూడా క్లోజ్

గూగుల్ భారీ ప్రక్షాళన.. పైథాన్ ఒక్కటే కాదు.. డార్ట్, ఫ్లట్టర్ కూడా క్లోజ్

ఉద్యోగుల తొలగింపుల పరంపర కొనసాగుతోంది. ఏరోజు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. ఖర్చుల తగ్గింపులో భాగంగా టెక్ దిగ్గజం గూగుల్.. గత కొన్ని వారాలుగా వివిధ విభాగాల్లో లేఆఫ్స్ ప్రకటిస్తోంది. తాజాగా పైథాన్, డార్ట్, ఫ్లట్టర్ వంటి డిపార్ట్ మెంట్ లలోని ఉన్న ఉద్యోగులందరినీ తొలగించినట్టు నివేదికలు వస్తున్నాయి.  ఖర్చులను తగ్గించుకునేందుకు అమెరికా వెలుపల తక్కువ జీతంతో పనిచేసే వారిని నియమించుకునేందుకు గూగుల్ యోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే పాత వారిని తొలిగించినట్లు కథనాలు వస్తున్నాయి.

మాస్టోడాన్​ అనే సోషల్​ మీడియా సైట్​లో Social.coop పోస్ట్ ఒక పోస్ట్​ చేసింది.​ గూగుల్ పైథాన్ బృందంలోని మాజీ సభ్యుల్లో ఒకరు.. లేఆఫ్​పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కామెంట్స్​ చేశారు. గూగుల్​లో తమ రెండు దశాబ్దాల కెరీర్ అత్యుత్తమమైనదని, కంపెనీ ఉద్యోగుల తొలగింపును ప్రారంభించడం అన్యాయమని ఆ ఉద్యోగి పేర్కొన్నారు. మేనేజర్​తో సహా తన టీమ్ మొత్తాన్ని తొలగించి.. వారి స్థానంలో విదేశాల నుంచి రిమోట్ వర్కర్లను నియమించడం బాధాకరమని మరో ఉద్యోగి అన్నారు. 

కాగా, గూగుల్ యాజమాన్యం ఇటీవల రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాల్లోనూ ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఈ విభాగాల్లో ప్రెషర్స్ ను నియమించుకోవడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తోంది.