Nag Ashwin: బహుశా.. ఇసుకని చూసి అలా అనుకున్నారేమో.. ఇచ్చిపడేసిన కల్కి డైరెక్టర్

Nag Ashwin: బహుశా.. ఇసుకని చూసి అలా అనుకున్నారేమో.. ఇచ్చిపడేసిన కల్కి డైరెక్టర్

కల్కి 2898 AD(Kalki 2898 AD) ఆ హాలీవుడ్ సినిమాకి కాపీ అంటా! ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ టాపికే ట్రెండ్ అవుతోంది. దీంతో ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. నిజంగా కల్కి సినిమా ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin). 

ఇటీవల ఆయన ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ లో భాగంగా దర్శకుడు నాగ్ అశ్విన్ కు కల్కి కాపీ కామెంట్స్ గురించి ప్రశ్న ఎదురయింది. దానికి సమాధానంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. కల్కి సినిమాను కొందరు హాలీవుడ్‌ మూవీ డ్యూన్ కి కాపీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాటిలో ఎలాంటి నిజం లేదు. బహుశా పోస్టర్స్ లో కనిపిస్తున్న ఇసుకను చూసి అలా అనుకుంటున్నారేమో. ఇప్పటికే చాలాసార్లు  కల్కి సినిమాను వేరే హాలీవుడ్‌ చిత్రాలతో కంపేర్ చేస్తూ వార్తలు వైరల్ చేశారు. మా సినిమాలో ఏ సినిమాలకు సంబందించిన రెఫరెన్స్‌లు ఉండవు. సినిమా విడుదలయ్యాక మీకే అర్థమవుతుంది.. అంటూ చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్. దీంతో కల్కి సినిమా కాపీ రూమర్స్ కి చెక్ పడింది.

ఇక కల్కి సినిమా విషయానికి వస్తే.. ఇండియన్ మైథలాజి అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడగా.. ఇటీవల వచ్చిన అమితాబ్ టీజర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. అన్ని హగ్గులు పూర్తి చేసుకొని జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.