వందే భారత్ రైలులో.. రూ.50 లక్షలు పట్టివేత

వందే భారత్ రైలులో.. రూ.50 లక్షలు పట్టివేత

ఎన్నికల టైంలో డబ్బు తరలింపునకు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు రాజకీయ నేతలు. ఇప్పటి వరకు రోడ్డు, సముద్ర, విమానాల ద్వారా మనీ తరలింపు చూశాం.. ఇప్పుడు వందే భారత్ రైళ్ల ద్వారా డబ్బు తరలింపు వ్యవహారం బయటపడటం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ రైలులో.. అక్షరాల 50 లక్షల రూపాయలు పట్టుబడటం కలకలం రేపుతుంది. ఈ డబ్బు హైదరాబాద్ నుంచి నెల్లూరు తరలిస్తున్నట్లు చెబుతున్నారు రైల్వే ప్రొడక్షన్ పోలీసులు. హైదరాబాద్ నుంచి నెల్లూరు చేరుకున్న రైలులో దిగిన కొందరు వ్యక్తులను.. రైల్వే పోలీసులు తనిఖీ చేయగా ఈ డబ్బు బయటపడింది. ఎన్నికల కోడ్ ఉండటంతో.. 50 వేల రూపాయలకు మించి డబ్బు తరలించే అవకాశం లేదు. ఒకవేళ అంతకు మించి డబ్బు తరలిస్తున్నట్లయితే.. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉండాల్సిందే. 

50 లక్షల రూపాయలకు సంబంధించి సరైన పత్రాలు లేని కారణంగా.. ఆ డబ్బును ఐటీ అధికారులకు అప్పగించారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది. ఈ డబ్బు ఏ రాజకీయ పార్టీకి చెందినదిగా ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్ లోని తమ సంస్థల నుంచి ఈ డబ్బును నెల్లూరు తరలిస్తుండగా పట్టుబడినట్లు సమాచారం. బస్సులు, వాహనాల్లో వెళితే తనిఖీలు ఎక్కువగా ఉండటంతో.. రైలు ద్వారా ఈ డబ్బు చేరవేస్తున్నట్లు తెలుస్తుంది.

వందేభారత్ రైలులో అయితే పెద్దగా తనిఖీలు ఉండవనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు నెల్లూరులో టాక్..