
ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు విద్యాశాఖ అధికారులు. ఈ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లమెంటరీ పరీక్షల తేదీలను వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం మాట్లాడుతూ.. ఫెయిల్ అయిన విద్యార్దులు ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. ఫెయిల్ అయినవారి సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చని తెలిపారు. జూన్ 3వ తేదీ నుండి13వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మార్కులపై విద్యార్థులకు డౌట్స్ ఉంటే రీ వాల్యూయేషన్, రీ వెరిఫికేషన్ కోసం 15 రోజుల పాటు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
కాగా, పదో తరగతి పరీక్షలు ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఓవరాల్ గా 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 89.42 శాతం బాలురు, 93.23 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. 99 శాతం ఫలితాలతో నిర్మల్ జిల్లా టాప్ లో నిలువగా, 65.10 శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్ చివరి స్థానంలో నిలిచింది. 3 వేల 927స్కూల్స్ లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఆరు పాఠశాలలో జీరో శాతం ఉత్తీర్ణత నమోదైంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పది పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.