4వ టీ20 కూడా మనదే.. శ్రీలంకపై 30 రన్స్ తేడాతో ఇండియా విమెన్స్ గెలుపు !

4వ టీ20 కూడా మనదే.. శ్రీలంకపై 30 రన్స్ తేడాతో ఇండియా విమెన్స్ గెలుపు !

శ్రీలంకతో నాలుగు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇండియా విమెన్స్ దుమ్ము లేపారు. మూడు టీ20ల గెలుపుతో సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు.. నాలుగో టీ20ని కూడా తమ ఖాతాలో వేసుకుని సత్తా చాటారు. నాలుగో టీ20లోనూ శ్రీలంకపై పూర్తి ఆధిపత్యాన్ని చాటారు.  

222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను 191 పరుగులకే పరిమితం చేస్తూ..  ఇండియా 30 పరుగుల తేడాతో అద్భుతమైన విక్టరీని సాధించింది. ఈ గెలుపుతో ఇండియా 4-0 ఆధిక్యం అజేయంగా నిలిచింది.

లక్ష్య ఛేదనలో శ్రీలంక ప్లేయర్లు హాసిని పెరీరా (33), చమరి ఆటపట్టు (52) తొలి వికెట్‌కు హాఫ్‌ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ  రత్వాత దులాని (29*)తో కలిసి ఆటపట్టు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించినా లాభం లేకుండా పోయింది. భారత బౌలర్లలో అరుంధతి, వైష్ణవి శర్మ  చెరో రెండు వికెట్లు తీసి శ్రీలంక గెలుపు ఆశలపై నీళ్లు చల్లారు. 

అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన ఇండియాకు.. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడుతూ.. తొలి వికెట్‌కు 162 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్‌తో అత్యంత దూకుడుగా ఆడుతూ 48 బంతులలో 80 రన్స్ చేసిన స్మృతి.. మహిళల క్రికెట్‌లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకుంది. షెఫాలీ వరుసగా మూడో హాఫ్‌ సెంచరీ సాధించింది. రిచా ఘోష్‌ (40, 16 బంతుల్లో) దూకుడుగా ఆడగా, హర్మన్‌ప్రీత్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. 4-0 తో శ్రీలంకపై గెలిచి తిరుగులేని జట్టుగా నిలిచింది టీమిండియా.

స్మృతి మంధాన రికార్డు:

భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందనా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసింది. ఆదివారం (డిసెంబర్ 28) తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20లో ఈ రికార్డ్ సాధించింది. తద్వారా ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెట్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఇండియన్‎గా, ఓవరాల్‎గా నాలుగో బ్యాటర్‎గా మందనా రికార్డ్ సృష్టించింది. భారత మహిళా క్రికెట్లో మందనా కంటే ముందు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(10,868 పరుగులు) ఈ రికార్డ్ సాధించింది. 

►ALSO READ | చరిత్ర సృష్టించిన స్మృతి మందనా.. ఇండియన్ మహిళా క్రికెట్ హిస్టరీలో రెండో ప్లేయర్‎గా అరుదైన రికార్డ్

మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు వీరే:

మిథాలీ రాజ్ (IND-W): 333 మ్యాచ్‌లు, 10,868 పరుగులు
సుజీ బేట్స్ (NZ-W): 355 మ్యాచ్‌లు, 10,652 పరుగులు
షార్లెట్ ఎడ్వర్డ్స్ (ENG-W): 309 మ్యాచ్‌లు, 10,273 పరుగులు
స్మృతి మంధాన (IND-W): 281 మ్యాచ్‌లు, 10,053 పరుగులు
నాట్ స్కైవర్-బ్రంట్ (ENG-W): 278 మ్యాచ్‌లు, 8,197 పరుగులు
హర్మన్‌ప్రీత్ కౌర్ (IND-W): 346 మ్యాచ్‌లు, 8,088 పరుగులు
మెగ్ లానింగ్ (AUS-W): 235 మ్యాచ్‌లు, 8,007 పరుగులు