చరిత్ర సృష్టించిన స్మృతి మందనా.. ఇండియన్ మహిళా క్రికెట్ హిస్టరీలో రెండో ప్లేయర్‎గా అరుదైన రికార్డ్

చరిత్ర సృష్టించిన స్మృతి మందనా.. ఇండియన్ మహిళా క్రికెట్ హిస్టరీలో రెండో ప్లేయర్‎గా అరుదైన రికార్డ్

న్యూఢిల్లీ: భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందనా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసింది. ఆదివారం (డిసెంబర్ 28) తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20లో ఈ రికార్డ్ సాధించింది. తద్వారా ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెట్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఇండియన్‎గా, ఓవరాల్‎గా నాలుగో బ్యాటర్‎గా మందనా రికార్డ్ సృష్టించింది. భారత మహిళా క్రికెట్లో మందనా కంటే ముందు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(10,868 పరుగులు) ఈ రికార్డ్ సాధించింది. 

మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు వీరే:

  • మిథాలీ రాజ్ (IND-W): 333 మ్యాచ్‌లు, 10,868 పరుగులు
  • సుజీ బేట్స్ (NZ-W): 355 మ్యాచ్‌లు, 10,652 పరుగులు
  • షార్లెట్ ఎడ్వర్డ్స్ (ENG-W): 309 మ్యాచ్‌లు, 10,273 పరుగులు
  • స్మృతి మంధాన (IND-W): 281 మ్యాచ్‌లు, 10,053 పరుగులు
  • నాట్ స్కైవర్-బ్రంట్ (ENG-W): 278 మ్యాచ్‌లు, 8,197 పరుగులు
  • హర్మన్‌ప్రీత్ కౌర్ (IND-W): 346 మ్యాచ్‌లు, 8,088 పరుగులు
  • మెగ్ లానింగ్ (AUS-W): 235 మ్యాచ్‌లు, 8,007 పరుగులు

►ALSO READ | దేవుడు వరమిస్తే కోహ్లీని మళ్లీ టెస్ట్ క్రికెట్‎లోకి తీసుకొస్తా: నవ్యజోత్ సింగ్ సిద్ధూ ఇంట్రెస్టింగ్ పోస్ట్