దేవుడు వరమిస్తే కోహ్లీని మళ్లీ టెస్ట్ క్రికెట్‎లోకి తీసుకొస్తా: నవ్యజోత్ సింగ్ సిద్ధూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

దేవుడు వరమిస్తే కోహ్లీని మళ్లీ టెస్ట్ క్రికెట్‎లోకి తీసుకొస్తా: నవ్యజోత్ సింగ్ సిద్ధూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టెస్ట్, టీ20 ఫార్మాట్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. కోహ్లీ టెస్ట్‎లకు వీడ్కోలు పలికి నెలలు కావొస్తోన్న ఇప్పటికి అతడి రిటైర్మెంట్‎పై చర్చలు మాత్రం ఆగడం లేదు. తాజాగా కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‎పై టీమిండియా మాజీ క్రికెటర్ నవ్యజోత్ సింగ్ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు. 

‘‘దేవుడు వరం ఇస్తానంటే కోహ్లీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడేలా చేయమని కోరుకుంటా. 1.5 బిలియన్ల జనాభా ఉన్న దేశానికి ఇంతకంటే ఆనందాన్ని ఇచ్చేదేదీ ఉండదు. కోహ్లీది 20ఏళ్ల యువకుడికి ఉండే ఫిట్నెస్. 24 క్యారెట్ గోల్డ్ అతను’’ అని సిద్ధూ పేర్కొన్నారు. సిద్ధూ కామెంట్స్‎తో కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‎పై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం అతడి ఫామే. కోహ్లీ ప్రస్తుతం భీకర ఫామ్‎లో ఉన్నాడు. 

►ALSO READ | అవన్నీ పుకార్లే.. గంభీరే ఉంటడు: టెస్ట్ కోచ్ మార్పు వార్తలపై తెగేసి చెప్పిన BCCI

ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేలో సిరీస్‎లో బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలతో అలరించాడు. అంతేకాకుండా సిరీస్‎లో అత్యథిక పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‎గా ఎంపికయ్యాడు. దాదాపు 15 ఏళ్ల తర్వాత దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగిన కోహ్లీ అక్కడ చెలరేగాడు. ఆంధ్రప్రదేశ్‎తో జరిగిన మ్యాచులో సెంచరీతో దుమ్మురేపాడు.

ఈ నేపథ్యంలో కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని సిద్ధూ వ్యాఖ్యానించడంతో అతడి కామెంట్స్‎ను పలువురు సమర్ధిస్తున్నారు. గత కొంత కాలంగా రెడ్ బాల్ క్రికెట్లో టీమిండియా ఆశించిన మేర రాణించడం లేదని.. దీంతో కోహ్లీ వెనక్కి తీసుకురావాలని బీసీసీఐని డిమాండ్ చేస్తున్నారు. కోహ్లీ ఫ్యాన్స్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.