భారతీయుడికి రూ.కోటి పరిహారం చెల్లించనున్న లండన్ KFC.. కారణం ఏంటంటే..

భారతీయుడికి రూ.కోటి పరిహారం చెల్లించనున్న లండన్ KFC.. కారణం ఏంటంటే..

గౌరవం పోయిన చోటే మర్యాద సంపాదించాలనే సామెత ఇతనికి కరెక్ట్ గా సెట్ అవుతుంది.  ఉపాధి కోసం లండన్ వెళ్లిన భారతీయుడికి KFC లో జరిగిన చేదు అనుభవం.. అతనిలో పోరాట పటిమను పెంచింది. జాతి వివక్షను ఎదుర్కొన్న అతడు.. చివరి వరకు పోరాడి గెలిచాడు. అంతే కాదు.. కంపెనీకే భారీ ఫైన్ వేసేలా చేసిన ఇతడి స్టోరీ ఇప్పుడు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన రవిచంద్రన్.. 2023 జనవరిలో KFC లో ఉద్యోగానికి చేరాడు. ఆ తర్వాత అతడిపై కుట్రలు మొదలయ్యాయి. జాతి వివక్ష చూపిస్తూ టార్చర్ చేయడం మొదలెట్టారు. అతని సూపర్ వైజర్ కజన్.. టార్చర్ పెడుతూ.. ఎక్కువ సేపు పనిచేయాల్సిందిగా ఒత్తిడి చేయడం మొదలెట్టాడు. పని చేయలేకపోతే జాబ్ కు రిజైన్ చేయాలని బెదిరించేవాడు. 

జాతి వివక్షతో కూడిన తిట్లతో ప్రతిరోజూ టార్చర్ పెడుతుండటంతో జాబ్ కు రిజైన్ చేసి.. ట్రిబ్యూనల్ ను ఆశ్రయించాడు మదేశ్ రవిచంద్రన్. శ్రీలంకకు చెందిన తన మేనేజర్ కజన్.. జాతి వివక్షతో నువ్వు నా బానిస అంటూ హరాష్ చేసినట్లు ట్రిబ్యూనల్ ముందు వెల్లడించాడు రవిచంద్రన్. వాదనలు విన్న జడ్జి పాల్ అబాట్.. రవిచంద్రన్ మానసికంగా, ఆర్థికంగా నష్టపోయినట్లు పేర్కొన్నారు. 

రవిచంద్రన్ సెలవు అడిగితే తిరస్కరించిన మేనేజర్.. ఎప్పుడూ అలాగే హాలిడేస్ ఇవ్వకుండా ఎక్కువ పని చేయించుకున్నట్లు విచారణలో తేల్చారు. శ్రీలంక తమిళ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తూ.. అందరూ కలిసి రవిచంద్రన్ ను వేధించినట్లు నిర్ధారించారు. దీంతో తీర్పును ఇండియన్ కు అనుకూలంగా వెల్లడించారు జడ్జి.

అనవసరంగా ఉద్యోగం నుంచి తొలగించడం, జాతి వివక్ష దాడులను ఎదుర్కొన్న బాధితుడు రవిచంద్రన్ కు 70 వేల యూరోల పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించారు.అంటే దాదాపు 85 లక్షల రూపాయలు రవిచంద్రన్ పరిహారం పొందుతాడు. సంచలన తీర్పు వెల్లడించిన ట్రిబ్యూనల్.. KFC ని ఆపరేట్ చేస్తున్న నెక్సస్ ఫుడ్స్ లిమెటెడ్ ను ఆక్షేపించింది. వర్క్ ప్లేస్ లో డిస్క్రిమినేషన్ లేకుండా చూసేందుకు ఉద్యోగులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది. మేనేజర్స్ కింది స్థాయి ఉద్యోగులపై సత్ప్రవర్తనతో వ్యవహరించేలా.. ఆరు నెలల్లోగా ట్రైనింగ్ పూర్తి చేయాల్సిందిగా సూచించింది.