హైదరాబాద్‎లో పబ్‎లపై ఈగల్ టీమ్ మెరుపు దాడులు.. 8 మందికి డ్రగ్ పాజిటివ్

హైదరాబాద్‎లో పబ్‎లపై ఈగల్ టీమ్ మెరుపు దాడులు.. 8 మందికి డ్రగ్ పాజిటివ్

హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. మరోవైపు న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల కట్టడికి సిటీ పోలీసులు, ఈగల్ టీమ్ పకడ్భందీ చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే శనివారం (డిసెంబర్ 27) కొండాపూర్‎లోని క్వేక్ ఎరేనా పబ్‎లో జరిగిన ప్రసిద్ధ ఉక్రేనియన్ డీజే ఆర్ట్‌బాట్ డీజే కాన్సర్ట్‎లో ఈగల్ టీమ్, సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. అధునాతన పరీక్షా కిట్‌లను ఉపయోగించి డ్రగ్ టెస్టులు నిర్వహించారు. 14 మందికి పరీక్షలు చేయగా.. అందులో 8 మందికి పాజిటివ్‎గా తేలింది. దీంతో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

►ALSO READ | త్వరలో ఒక్క సిగరెట్ ధర 72 రూపాయలు ? స్మోకింగ్ మానేద్దాంరా బాబు అనుకునే రోజు వస్తుందా !