సోమాజిగూడ ఆల్‎పైన్ హైట్స్ అపార్ట్మెంట్‎లో భారీ అగ్ని ప్రమాదం

సోమాజిగూడ ఆల్‎పైన్ హైట్స్ అపార్ట్మెంట్‎లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం (డిసెంబర్ 28) రాత్రి సోమాజిగూడలోని ఆల్ పైన్స్ అపార్ట్‎మెంట్5వ అంతస్తులో సిలిండర్ బ్లాస్ట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాభ్రాంతులకు గురైన అపార్ట్మెంట్ వాసులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

►ALSO READ | హైదరాబాద్‎లో పబ్‎లపై ఈగల్ టీమ్ మెరుపు దాడులు.. 8 మందికి డ్రగ్ పాజిటివ్